ఇంటర్వ్యూ: లక్ష్ – ప్రభాస్, ఎన్టీఆర్ కూడా నా తరువాత కెరీర్ ప్రారంభించిన వారే.

ఇంటర్వ్యూ: లక్ష్ – ప్రభాస్, ఎన్టీఆర్ కూడా నా తరువాత కెరీర్ ప్రారంభించిన వారే.

Published on Feb 19, 2020 12:38 PM IST

లక్ష్ చదలవాడ, దిగంగన సూర్యవంశీ జంటగా సినిమా నిర్మాణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంలో రమేష్ కదుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వలయం. సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. సినిమా విడుదల నేపథ్యంలో హీరో లక్ష్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

వలయం మూవీ కథేమిటీ?

హీరో భార్య దిశా అనుకోకుండా ఒక రోజు కనిపించకుండా పోతుంది. ఆమె కనిపించకుండా పోవడానికి అసలు కారణం ఎవరు? అనే కోణంలో సినిమా నడుస్తుంది. నా పాత్ర కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఫుల్ ప్యాక్డ్ మూవీ వలయం.

దిశా ఘటనను బేస్ చేసుకొని, హీరోయిన్ కి ఆ పేరు పెట్టారా?

అది కేవలం కో ఇన్సిడెంట్ మాత్రమే, డైరెక్టర్ స్క్రిప్ట్ రాసినప్పుడే దిశా పేరుతో రాయడం జరిగింది. టైటిల్ కూడా అదే అనుకున్నాం. దిశా పేరు కొంచెం సాఫ్ట్ గా ఉండటంతో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీ అనే భావన ప్రేక్షకులలో కలిగే అవకాశం కలదు. అందుకే తరువాత వలయం అని టైటిల్ పెట్టడం జరిగింది. దిశా సంఘటన జరిగేనాటికి మా సినిమా డబ్బింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇలాంటి సున్నితమైన ఘటనను సినిమా ప్రచారానికి వాడుకున్నట్లు ఉంటుందని, హీరోయిన్ పేరు మార్చాలని చూశాం, ఐతే డబ్బింగ్ లో లిప్ సింక్ కాకపోవడంతో అదే పేరు కొనసాగించాల్సివచ్చింది.

గతంలోనే మీరు సినిమాలలో నటించినట్లున్నారు?

చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను మూడు సినిమాలు చేశాను, హీరోగా నాలుగు సినిమాలు చేశాను. ఆ తరువాత సింగపూర్ వెళ్లి ఎం బి ఏ చేసి, 13ఏళ్ల తరువాత మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాను. ప్రభాస్, ఎన్టీఆర్ కూడా నా తరువాత కెరీర్ ప్రారంభించిన వారే.

నటుడిగా, నిర్మాతగా..ఏది కష్టం అనిపిస్తుంది?

నిర్మాతగా కంటే కూడా హీరోగా చాల కష్టం అనిపించింది. ఈ పాత్ర కోసం 25 కేజీల బరువు తగ్గాను. ఇప్పటి హీరోలవలే ఫిట్ గా కనిపించడం కోసం పొద్దున్నే లేవడం, వర్క్ ఔట్స్ చేయడం కష్టం అనిపించేది. పీస్ ఫుల్ గా ఉన్న జీవితంలోకి మళ్ళీ ఈ కష్టాలు ఎందుకు.. అనిపించేది.

ఇప్పటి ప్రొడ్యూసర్స్ కష్టాలు ఏమిటీ?

ఈ రోజుల్లో సినిమా తీయడం ఈజీ, విడుదల చేయడం కష్టం. పెద్ద సినిమాలు ఎలాగూ జనాలను ఈజీగా రీచ్ అవుతాయి. ఐతే చిన్న సినిమా విడుదల చేయడం కష్టం. సినిమా బాగుంటే తప్ప మీడియా మరియు ఆడియన్స్ పట్టించుకోరు.

మీరు హీరోగా చేసిన సినిమాలు ఏమిటీ?

నా మొదటి సినిమా ‘నీతో వస్తా’ అందులో రిమా సేన్ హీరోయిన్, నెక్స్ట్ 786 అందులో హంసా నందిని హీరోయిన్ అలాగే మేస్త్రి, శంకర్ చిత్రాలు చేశాను. నేను 16ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చాను, అప్పటి నుండి బ్రేక్ లేకుండా కంటిన్యూ చేయాల్సింది. ఎర్లీగా వచ్చి ఎర్లీగా ఇండస్ట్రీకి దూరం అయ్యాను.

బిచ్చగాడు సినిమా మీకు పెద్ద విజయాన్ని అందించినట్లుంది?

మేము ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నందుకు, మాకు దక్కిన ఓ పెద్ద గిఫ్ట్ బిచ్చగాడు అనుకోవాలి. బిచ్చగాడు ఒక వండర్ అని చెప్పాలి. నేను సినిమాలలోకి కం బ్యాక్ ఇవ్వడానికి కారణం కూడా ఆ మూవీనే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు