ఇంటర్వ్యూ : వైవిఎస్ చౌదరి – ‘రేయ్’ కి సాయి పవర్ అయితే, శ్రద్ధ దాస్ ఆక్సిజన్.!

ఇంటర్వ్యూ : వైవిఎస్ చౌదరి – ‘రేయ్’ కి సాయి పవర్ అయితే, శ్రద్ధ దాస్ ఆక్సిజన్.!

Published on Mar 25, 2015 5:30 PM IST

Y-vs-chowdary
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘దేవదాసు’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకనిర్మాత వైవిఎస్ చౌదరి. మరిసారి వైవిఎస్ చౌదరి దర్శకనిర్మాతగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘రేయ్’. ఈ సినిమా శ్రీరామనవమి కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము ఆయనతో కాసేపు ముచ్చటించి, నాలుగేళ్ల రేయ్ జర్నీ గురించి తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) కరేబియన్ బ్యాక్ డ్రాప్ లో ‘రేయ్’ కథ రాయడానికి గల రీజన్ ఏమిటి.?

స) నేను యుఎస్ లో దేవదాసు షూటింగ్ చేస్తున్నప్పుడు నా కోఆర్డినేటర్ గోపి గారు బహామాస్ షూటింగ్ కి చాలా బాగుంటుంది అని చెప్పారు. నాకు కథా పరంగా డిమాండ్ చేస్తేనే ఒక లోకేషన్ కి వెళ్తాను. ఆ తర్వాత నేను బహామాస్ లో ఎవరు ఉంటారు ఏంటి, ఎలా అనేది ఎంక్వైరీ చేస్తే కరేబియన్ ఐ లాండ్స్ లో బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ వలన మన ఇండియాకి చెందిన వారు అక్కడ వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడ మనవాళ్ళు ఉన్నారు అన్నాక ఆ బ్యాక్ డ్రాప్ తెలుగు ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుందనిపించి కథ రాసుకున్నాను.

ప్రశ్న) అసలు ‘రేయ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.?

స) నా పరంగా పరంగా రేయ్ అంటే గెలుపు కోసం అరిచే అరుపు. ఒకరు విసిరిన సవాల్ కి బదులు చెప్పడమే మా సినిమా కథ. మా స్టొరీ పాయింట్ కి ఇది పర్ఫెక్ట్ అనిపించి పెట్టాము. అందుకే ట్యాగ్ లైన్ కూడా షౌట్ ఫర్ సక్సెస్ అని పెట్టాం. మన నిజ జీవితంలో కూడా రేయ్ అనే పదాన్ని రోజూ వినియోగిస్తుంటాం. క్యాచీ గా ఉండడం కూడా మాకు హెల్ప్ అయ్యింది.

ప్రశ్న) ట్రైలర్స్ ప్రకారం హీరో, హీరోయిన్స్ అందరూ చూడటానికి, డైలాగ్స్ పరంగా బాగా లౌడ్ గా కనిపిస్తున్నారు. ఎందుకలా.?

స) ఇక్కడ అందరికీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. కరేబియన్ ప్రజలు బేసికల్ గా లౌడ్ ఎక్స్ ప్రెషర్స్. వాళ్ళ భావాలను దాచుకోకుండా బాగా ఓపెన్ గా, లౌడ్ గా చెప్తారు. ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నప్పుడు నాచురాలిటీ మిస్ అవ్వకూడదనే అలా పెట్టాము. కానీ సినిమా మొత్తం లౌడ్ గా ఉండదు. సందర్భం డిమాండ్ చేసినప్పుడు, పాత్రలు ఎక్స్ ప్రెస్ చేసేప్పుడు మాత్రమే లౌడ్ నెస్ ఉంటుంది.

ప్రశ్న) ‘రేయ్ విత్ పవనిజం’ సాంగ్ ని ఆడియోగానే కాకుండా విజువల్ గా కూడా తీస్తున్నారు. అది ఎంతవరకు వచ్చింది.?

స) ముందు అనుకున్న దాని ప్రకారం ప్రమోషన్స్ కోసం ఓన్లీ పాటని మాత్రమే రిలీజ్ చెయ్యాలి అనుకోని చేసాం. కానీ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ మరియు అభిమానులు ఆ పాట విజువల్ గా కావాలని కోరుకోవడంతో వీడియో కూడా షూట్ చేసాం. కానీ ఆ పాటకి గ్రాఫిక్స్ ని హై స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటే మామూలు పేరు కాదు కదా, అందుకే గ్రాఫిక్స్ కి కొంత టైం పడుతుంది. సినిమా రిలీజ్ రోజు ఈ సాంగ్ ఉండదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాలో యాడ్ చేస్తాం.

ప్రశ్న) మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో అన్నప్పుడు సాయి ధరమ్ తేజ్ కోసం సినిమాలో ఏమన్నా కేర్ తీసుకున్నారా.?

స) కచ్చితంగా కేర్ తీసుకోవాలి కదా.. మామూలుగా కొత్త హీరోనిపరిచయం చేస్తున్నాం అనుకోండి.. తనని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలివేట్ చెయ్యాలి. కానీ సాయికి మెగా కాంపౌండ్ ఇమేజ్ ఉండడం తో నా కథలో సెకండ్ ఫ్లోర్ నుంచి చూపించాను. మెగా ఇమేజ్ వల్లే కథా పరంగా చిరు గారి సాంగ్ ని, కళ్యాణ్ గారి సాంగ్ ని వాడుకున్నాను. ఫస్ట్ రోజు మెగా అభిమానులు మెగా హీరో నుంచి ఏమేమి ఆశించి వస్తారో అవన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కి పెరుగుతారు.

ప్రశ్న) మెగా హీరోని చూపిస్తున్నారు, విలనిజంని బాగా ఎలివేట్ చెయ్యాలి. కానీ మీరేమో లేడీ విలన్ ని పెట్టారు. రిస్క్ అని అనిపించలేదా.?

స) నాకైతే రిస్క్ అనిపించలేదు, నా పరంగా అదొక కొత్తదనం. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలన్ గా చేసారు, హీరో ఎలివేట్ అయ్యాడు కదా. అలానే ఈ సినిమాలో కూడా లేడీ విలన్ కి ఇచ్చిన బిల్డప్ లో నుంచి హీరోయిజం ని ఎలివేట్ చేసాం అందుకే కచ్చితంగా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. లేడీ విలన్ అంటే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆన్ స్క్రీన్ గ్లామర్ గా కనిపిస్తూ కనువిందు కూడా చేస్తుంది.

ప్రశ్న) మీరు సీనియర్ హీరోస్ తో చేసారు, అలాగే నలుగురు యంగ్ హీరోస్ ని పరిచయం చేసారు. సీనియర్ మరియు జూనియర్స్ తో సినిమా చేసేటప్పుడు తేడా ఏముంటుంది.?

స) సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాం అంటే వారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొత్తదనం కోసం ట్రై చెయ్యాలి. అదే కొత్త హీరో అంటే ఏమీ ఉండదు, వీడికి ఎలాంటి బ్యాక్ డ్రాప్ ఇస్తే హీరోగా ఎలివేట్ అవుతాడు అనే దానిపై బాగా కసరత్తు చేయాలి. సీనియర్ హీరో అన్నప్పుడు కొన్ని ప్లస్, కొన్ని మైనస్ ఉంటాయి. అదే కొత్త హీరో అన్నపుడు కొన్ని ప్లస్, కొన్ని మైనస్ ఉంటాయి.

ప్రశ్న) ఈ మూవీ డైలాగ్ రైటర్ శ్రీధర్ శ్రీపాన గురించి చెప్పండి.?

స) శ్రీధర్ శ్రీపాన డైలాగ్స్ ఈ సినిమాకి ఆయువు పట్టు లాంటివి. ఎంతో యూత్ ఫుల్ గా, జాయ్ ఫుల్ గా ఉంటాయి. చెప్పాలంటే ఈ మధ్య శ్రీధర్ ఏ సినిమాకి పనిచేస్తే ఆ సినిమా హిట్ అయిపోతోంది. మాది కూడా హిట్ అవుతుంది.

ప్రశ్న) ఈ సినిమాలో ఉన్న మెయిన్ రోల్స్ చేసిన సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ ల గురించి చెప్పండి.?

స) రేయ్ అనే సినిమాకి సాయి ధరమ్ తేజ్ రోల్ పవర్ అయితే, సయామీ ఖేర్ రోల్ ఎనర్జీ మరియు శ్రద్ధ దాస్ రోల్ ఆక్సిజన్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు, అలాగే ప్రాణం పెట్టి పనిచేయడమే కాకుండా ఆన్ స్క్రీన్ ది బెస్ట్ ఇచ్చారు. ఈ సినిమాతో ముగ్గురికీ మంచి పేరు తెస్తుంది.

ప్రశ్న) చివరిగా మార్చి 27న రిలీజ్ కానున్న రేయ్ సినిమా చూసే ఆడియన్స్ కి ఏం చెపుతారు.?

స) ‘రేయ్’ సినిమా ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. మొదటి నుంచి చివరిదాకా స్పీడ్ గా వెళ్లిపోతుంటుంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే యాక్షన్, లవ్, కామెడీ, పంచ్ డైలాగ్స్, డాన్సులు ఇలా అన్నీ ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రతిసారి నేను ఎన్నో ఇబ్బందులు పడి రిలీజ్ చేసినప్పుడు తెలుగు ప్రేక్షకులు నాకు అండగా ఉండి సినిమాలు హిట్ చేసారు. అలానే దేన్నీ కూడా హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, రేయ్ సినిమా రిలీజ్ లేట్ అయినా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అందించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము…

సంబంధిత సమాచారం

తాజా వార్తలు