చిట్ చాట్ : శ్రద్ధ దాస్ – నా పాత్ర రమ్యకృష్ణ గారి నీలాంబరి పాత్రని గుర్తు చేసేలా ఉందన్నారు.

చిట్ చాట్ : శ్రద్ధ దాస్ – నా పాత్ర రమ్యకృష్ణ గారి నీలాంబరి పాత్రని గుర్తు చేసేలా ఉందన్నారు.

Published on Mar 22, 2015 5:00 PM IST

Shrada-das
పలు తెలుగు సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ శ్రద్ధ దాస్. అలాంటి శ్రద్ధ దాస్ మొదటిసారిగా తెలుగులో చేసిన ఫుల్ లెంగ్త్ రోల్ ‘రేయ్’ సినిమాలో చేసింది. హీరో సాయి ధరమ్ తేజ్ కి గట్టి పోటీనిచ్చే పాత్రలో శ్రద్ద దాస్ కనిపించనున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రద్ధ దాస్ తో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మొదటి సారి రేయ్ లో చేసిన మీ ఫుల్ లెంగ్త్ పాత్ర గురించి చెప్పండి.?

స) అవునండి ఫస్ట్ ఫుల్ లెంగ్త్ రోల్ రేయ్ లో చేశాను. నేను ఇందులో చేసింది ఫుల్ నెగటివ్ రోల్. చూడటానికి చాలా గ్లామరస్ అండ్ స్టైలిష్ గా ఉండే ఓ పాప్ స్టార్. ఎంత గ్లామరస్ గా ఉంటుందో నా పాత్ర అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. చెప్పాలంటే హీరోకి ఈక్వల్ గా అనిపించే పాత్ర. హీరోకి నాకు మధ్య పోటా పోటీ సన్నివేశాలు ఉన్నాయి. ఒకవేళ నా పాత్రని తీసేసి చూస్తే సినిమాలో కథే ఉండదు. ఇలాంటి రోల్ కి నన్ను సెలక్ట్ చేసినందుకు వైవిఎస్ చౌదరి గారికి థాంక్స్ చెప్పాలి.

ప్రశ్న) ఇందులో మీరు పాప్ స్టార్ అన్నారు మరి దాని గురించి చెప్పండి.?

స) అవును.. ఇందులో మెక్సికన్ అమెరికన్ గర్ల్ పాత్రలో కనిపిస్తుంటాను. మై నేమ్ జెన్న.. నేనొక టాప్ పాప్ స్టార్. ప్రతి సంవత్సరం జరిగే రాక్ స్టార్ కాంపిటీషన్ లో 3 సంవత్సరాలుగా విన్నర్ గా గెలుస్తుంటాను. ఆ టైంలోనే రేయ్ బ్యాండ్ వస్తుంది. ఎవ్వరినీ గెలవనివ్వ కూడదు అనుకునే మెంటాలిటీ. రేయ్ బ్యాండ్ కి ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. రేయ్, ఒరేయ్ అనే మాస్ డైలాగ్స్ కూడా ఉంటాయి.

ప్రశ్న) మెక్సికన్ అమెరికన్ గర్ల్ పాత్ర అంటున్నారు.. ఆ పాత్ర కోసం ఏమన్నా వర్క్ అవుట్ చేసారా.?

స) అవునండి ఈ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేసాను. నేను స్వతహాగా డైటింగ్, ఫిజికల్ ఎక్సర్ సైజెస్ చెయ్యను. కానీ ఈ సినిమాలో మెక్సికన్ అమెరికన్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోవడం కోసం నా వెయిట్ తగ్గించమన్నారు. ముఖ్యంగా ఆ షెడ్యూల్ మొత్తం నాకు కేవలం బాయిల్ వెజిటబుల్స్, బాయిల్ చికెన్, జ్యూస్ మాత్రమే తిన్నాను. దానివల్లే సినిమాలో ఎంతో స్లిమ్ గా కనిపిస్తాను. అలాగే అమెరికన్ పాప్ స్టార్ లుక్ కోసం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ట్రై చేసాను. సుమారు 250 పైగా కాస్ట్యూమ్స్ ఇందులో వాడాను. ముఖ్యంగా డైరెక్టర్ గా డ్రెస్ సెట్ కాకపోతే షూటింగ్ కాన్సల్ చేసేసేవారు. ఈ కాస్ట్యూమ్స్ పరంగా ఫస్ట్ షెడ్యూల్ లో నా కన్నుకి దెబ్బ తగిలింది. అయినా అక్కడే ఉంది క్యూర్ అయ్యాక షూట్ ఫినిష్ చేసాను.

ప్రశ్న) ఈ పాత్ర కోసం డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఎలాంటి సలహాలు ఇచ్చారు. ?

స) అవును, డిజైన్ చేసిందే ఆయన కదా.. ఆయన పాప్ స్టార్స్ అయిన జెన్నిఫర్ లోపెజ్, బియాన్సే, బ్రిట్నీ స్పియర్స్ లాంటి వాళ్ళని క్లోజ్ గా అబ్సర్వ్ చేయమని చెప్పారు. బేసికల్ గా అమెరికన్ పాప్ సింగర్స్ సాఫ్ట్ కానీ మన తెలుగుకు మ్యాచ్ అవ్వాలని వైవిఎస్ సార్ నాతో ట్రావెల్ అయ్యి నాకో స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ ఇచ్చాడు. సినిమా కోసం ఎంత కష్టపడ్డాను అన్నది పక్కన పెడితే.. వైవిఎస్ గారి ఇచ్చిన ఈ అవకాశం వలన ముందు ముందు నాకు ఇలాంటి పవర్ఫుల్ రోల్స్ వస్తాయని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ఫైనల్ వెర్షన్ సినిమా చూసారా.? చూసిన వారు మీ పాత్ర గురించి ఏమంటున్నారు.?

స) నేను ఫైనల్ వెర్షన్ చూడలేదు.. ఈ సినిమాని చూసిన కొందరు మాత్రం చాలా రోజుల తర్వాత ఓ లేడీ పవర్ఫుల్ పాత్ర చేసారు. ఈ సినిమాలో నా పాత్ర ‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరిపాత్రని గుర్తు చేసిందని చెప్పారు. నా పాత్ర ఆ స్టైల్లో ఉండదు కానీ ఆ పాత్రలో ఉండే పొగరు, ఈగో నేను చేసిన పాప్ స్టార్ పాత్రలో ఉంటాయి.

ప్రశ్న) ఈ సినిమాతో మీ ఫాన్స్ కి గ్లామర్ తో ఐ ఫీస్ట్ ఇస్తారనమాట.?

స) నవ్వులు.. మీరన్నట్టు నాకు అంతమంది ఎక్కువ ఫ్యాన్స్ లేరు. కానీ నాకున్న ఫ్యాన్స్ అందరినీ మాత్రం బాగా సాటిస్ ఫై చేస్తుంది. ఆ విషయంలో 100% గ్యారంటీ ఇస్తాను.. చాలా స్టైలిష్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తుంటాను.

ప్రశ్న) కెరీర్ పరంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కంటే మీరు సీనియర్.. మరి సాయి పెర్ఫార్మన్స్ గురించి చెప్పండి.?

స) నేను డైరెక్ట్ గా యాక్టర్ గా సాయి ధరమ్ తేజ్ లోని గ్రో చూసాను.. ఎవరికైనా మొదటి సినిమా అయితే ఎక్కువ టేక్స్ తీసుకుంటారు. అలానే సాయి కూడా ఎక్కువ టేక్స్ తీసుకున్నాడు మొదట్లో. రీసెంట్ గా పవనిజం సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒకరి రెండు టెక్స్ లో ఫినిష్ చేసేసాడు. నటనలో తన గ్రోత్ చాలా హై రేంజ్ లో ఉంది. ఒక నటుడికి మంచి అనుభవం రావడానికి నాలుగైదు సినిమాల సమయం పడుతుంది కానీ సాయి మాత్రం ఒక్క సినిమాతో చాలా నేర్చుకున్నాడు. చాలా మెమొరీ పవర్ అండ్ డాన్సులు సూపర్బ్ గా చేస్తాడు.

ప్రశ్న) ఇకపై కూడా ఎక్కువగా గ్లామరస్ రోల్స్, ఐటెం సాంగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా.?

స) నాకు గ్లామరస్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చెయ్యడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక నుంచి గ్లామరస్ రోల్స్ లో కూడా కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో గ్లామరస్ గా కనిపిస్తూ ఒక చెట్టులా నిలబడుకోవాలంటే నాకు ఇష్టం లేదు.

ప్రశ్న) ప్రస్తుతం చేస్తున్న సినిమాలేమిటి.? అలాగే ఏమన్నా తెలుగు సినిమాలకి కమిట్ అయ్యారా.?

స) ప్రస్తుతం సచిన్ జోషీ సరసన హిందీ – తెలుగులో తీస్తున్న ‘హంటింగ్ ఆఫ్ బాంబే మిల్స్’ అనే సినిమా చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏమీ సైన్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్లామర్ తో పాటు నటనకి ఆస్కారం ఉన్న రోల్స్ మరియు సెకండ్ లీడ్ కాకుండా హీరోయిన్ గా సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు