పుష్ప పై హిట్ మూవీ ఇంపాక్ట్ ఉంటుందా..?

పుష్ప పై హిట్ మూవీ ఇంపాక్ట్ ఉంటుందా..?

Published on Apr 10, 2020 11:00 PM IST

డైరెక్టర్ సుకుమార్ వైవిధ్యమైన సినిమాలకు చిరునామా. ఆయన కెరీర్ ప్రారంభం నుండి తీసిన అన్ని సినిమాలు ఒక సినిమాతో మరో సినిమాకు పోలిక ఉండదు. ఒక ఆర్య 2 మినహా, అది సీక్వెల్ కాబట్టి దాన్ని వదిలేయాల్సిందే. ఐతే పుష్ప సినిమా పై తన గత చిత్రం రంగస్థలం ప్రభావం గట్టిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగస్థలం మాదిరి పుష్ప కూడా రివేంజ్ డ్రామా అని ఇండస్ట్రీలో టాక్. మరి అందరు దర్శకుల వలె సుకుమార్ కూడా రంగస్థలం మాయలో పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బుర్రపెట్టి లాజిక్ మిస్ కాకుండా సినిమాలు తీసే సుకుమార్ కి ఎన్ని మంచి సినిమాలు తీసినా రంగస్థలం రేంజ్ లో హిట్ దక్కలేదు. సుకుమార్ కెరీర్ లోనే బడా బ్లాక్ బస్టర్ గా ఉన్న రంగస్థలం ప్రభావంతో పుష్ప మూవీ తెరకెక్కిస్తున్నారని కొందరి డౌట్. ఈ అనుమానాలన్నిటి సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు