జీ5లో మెగా మేనల్లుడి సినిమా ?

జీ5లో మెగా మేనల్లుడి సినిమా ?

Published on Oct 25, 2020 10:00 PM IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఉప్పెన’ అనేచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని తెలుస్తోందని.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

పైగా ఈ సినిమాకి సదరు ఓటిటి సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయట. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి. హిట్ వచ్చినా రాకపోయినా ఆల్ రెడీ వైష్ణ‌వ్‌ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు