‘ఇజం’ ఆడియో రిలీజ్‌కు రెడీ!

‘ఇజం’ ఆడియో రిలీజ్‌కు రెడీ!

Published on Sep 28, 2016 7:30 PM IST

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా మొదట ఈనెల్లోనే విడుదలవుతుందన్న ప్రచారం జరిగినా, ప్రొడక్షన్ పనులింకా పూర్తి కాకపోవడంతో సినిమాను అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను టీమ్ శరవేగంగా పూర్తి చేస్తోంది.

అదేవిధంగా అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో విడుదలకు కూడా టీమ్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఆదిత్య మ్యూజిక్ కంపనీ ద్వారా ‘ఇజం’ ఆడియో విడుదల కానుంది. ఇక త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆదిత్య మ్యూజిక్ స్పష్టం చేసింది. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఆడియో విడుదలను చేపట్టేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు