కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ‘ఇజం’ !

కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ‘ఇజం’ !

Published on Oct 22, 2016 11:29 AM IST

ism

కెరీర్లో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు ‘ఇజం’ రూపమ్లో ఆ సక్సెస్ దక్కేలా కనిపిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కళ్యాణ్ రామ్ సినిమా కోసం కష్టపడి సరికొత్త లుక్ ను ట్రై చేయడం, పిఆర్ టీమ్ చేపట్టిన ప్రమోషన్లు, టీజర్, ఫస్ట్ లుక్స్ వంటి కారణాల వల్ల ఈ చిత్రంపై అభిమానుల్లో అంచానాలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి.

దీంతో నిన్నటిరోజున ఈ సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ వర్గాల నుండి ఎలుస్తున్న లెక్కల ప్రకారం నైజాం లో రూ. 1. 09 కోట్లు, కృష్ణాలో రూ. 18.7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 30 లక్షలు, గుంటూరు రూ. 45 లక్షలు, నెల్లూరు రూ. 13 లక్షలు కలుపుకుని ఎపి, తెలంగాణాల్లో కలిపి సుమారు రూ. 2.75 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్. ఇక ఈ నెలలో స్ట్రీట్ తెలుగు సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమా యొక్క లాంగ్ రన్ కలెక్షన్లకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు