ఆ వార్తలో నిజం లేదు !

ఆ వార్తలో నిజం లేదు !

Published on Dec 12, 2017 6:50 PM IST

రవితేజ తో రాజా ది గ్రేట్ సినిమా తీసి విజయం సాదించిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కాని తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఎఫ్ 2 టైటిల్ తో తెరకేక్కబోయే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించబోతున్నారు.

స్టోరి విన్న వెంకటేష్ సినిమా చేస్తానని చెప్పాడంట. ఈ సినిమాలో నటించబోయే మరో హీరో ఎవరనేది త్వరలో తెలియనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి త్వరలో అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించబోతున్నాడు. వెంకటేష్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనుప్ రుబెంస్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సురేష్ బాబు అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు