కాస్ట్లీ ప్రాపర్టీ కొనుక్కున్న జగపతి బాబు

కాస్ట్లీ ప్రాపర్టీ కొనుక్కున్న జగపతి బాబు

Published on May 6, 2015 8:26 AM IST

jagapathi-babu

హన్డ్సం అండ్ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో జగపతి బాబు. జగ్గు భాయ్ కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇకపోతే గత కొన్ని సంవత్సరాల క్రితం సరైన సక్సెస్ లేకపోవడం వలన ఫైనాన్సియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఆయన గత ఏడాది వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా రూపాంతరం చెంది మరో సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. లెజెండ్ విజయంతో జగపతి బాబు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయాడు.

ప్రసతుతం కెరీర్లో బిజీ బిజీగా ఉన్న జగపతి బాబు ఫైనాన్సియల్ గా కూడా బాగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాడు. ఆయన రీసెంట్ గా కుకట్ పల్లిలో బాగా కాస్ట్లీ అయిన లోధ టవర్స్ లో ఓ ప్రాపర్టీని కొన్నారు. అంతే కాకుండా ముందు ముందు ఎలాంటి ఫైనాన్సియల్ ఇబ్బందులు రాకూడదు అని వచ్చిన మనీని పలు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు మహేష్ బాబు – కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. అలాగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఎన్.టి.ఆర్ – సుకుమార్ ల సినిమాకి కూడా సైన్ చేసాడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు