మహేష్ బాబుకి నాన్నగా జగపతి బాబు.!

మహేష్ బాబుకి నాన్నగా జగపతి బాబు.!

Published on Apr 21, 2014 11:52 AM IST

jagapati-babu-is-going-to-p
టాలీవుడ్ హన్డ్సం హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే ఒకప్పటి ఫ్యామిలీ, మాన్లీ హీరో జగపతి బాబు. అలాంటి వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది, అది కూడా తండ్రీ కొడుకుల్లా..! ఒక్కసారి ఊహించుకోండి.. ప్రస్తుతానికి ఇది ఊహే అయినా త్వరలో ఇది నిజం కానుంది.

అసలు విషయంలోకి వెళితే సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి నాన్నగా జగపతి బాబు నటించనున్నాడు. ఈ విషయాన్ని జగపతిబాబు తన పేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. ‘కొరటాల శివ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా నటించడానికి సర్వం సిద్దమైంది. టాలీవుడ్ కలల రాకుమారిడితో స్క్రీన్ పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ పోస్ట్ చేసాడు.

మైత్రి మూవీస్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు