దసరాకే రానున్న 75 కోట్ల బడ్జెట్ సినిమా!

దసరాకే రానున్న 75 కోట్ల బడ్జెట్ సినిమా!

Published on Sep 28, 2016 8:45 PM IST

jaguaar
మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వార్’ అనే ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈమధ్యే అంగరంగ వైభవంగా ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకుంది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకున్న సినిమా, నేడు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు పక్కాగా సిద్ధమైపోయింది.

సెన్సార్ బృందం నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందని టీమ్ స్పష్టం చేసింది. ఇప్పటికే దసరా వారం (అక్టోబర్ 7-10) ప్రేమమ్, ఈడు గోల్డ్ ఎహే, అభినేత్రి, మనఊరి రామాయణం లాంటి సినిమాలు ఉండగా, అదే వారం జాగ్వార్ కూడా రేసులోకి వచ్చేసింది. మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమన్నా ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించనుండడం ఈ సినిమాకు అంచనాలను పెంచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు