టీజర్లో సరికొత్త ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు !
Published on Jul 7, 2017 1:50 am IST


జూ.ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జై లవ కుశ’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ఒకటైన ‘జై’ కు సంబందించిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్నపాటి యాక్షన్ కట్ తో పాటు ఒక పవర్ ఫుల్ డైలాగ్ ఉన్న టీజర్లో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపిస్తున్నాడు.

సాధారణంగానే ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేయగల ఎన్టీఆర్ మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు ఆయన ఎంతలా న్యాయం చేశాడంటే లుక్స్ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ, మ్యానరిజం పరంగా కానీ ఒక స్టార్ హీరోను గుర్తుకు తేకుండా నిజంగా ఎన్నో సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసిన ప్రతి నాయకుడిగానే కనిపించారు. రాయలసీమ యాసలో మాట్లాడటం, అందులో కూడా మాట లోపం కనిపిస్తుండటం మరింతగా ఆసక్తి రేపుతున్నాయి.

మరి టీజర్లోనే ఇంతలా హడావుడి చేసిన తారక్ ఇక సినిమాలో ఎలాంటి భీభత్సం చేస్తాడో చూడాలి. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 21సెప్టెంబర్ న రిలీజ్ కానుంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి

 
Like us on Facebook