‘జై సింహ’ 5 రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్లు !

‘జై సింహ’ 5 రోజుల ప్రపంచవ్యాప్త వసూళ్లు !

Published on Jan 17, 2018 5:06 PM IST


నటసింహం బాలక్రిష్ణ నటించిన 102వ చిత్రం ‘జై సింహ’ బి, సి సెంటర్లలో బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత మెల్లగా పుంజుకుని వసూళ్లలో కూడా పెరుగుదలను చూపించింది. 12వ తేదీన వచ్చిన ఈ చిత్రం నిన్నటి వరకు అనగా 5 రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ.23. 93 కోట్లను వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణల్లో రూ.19.07 కోట్లను రాబట్టిన ఈ చిత్రం కర్ణాటలో రూ.2.76 కోట్లు, ఓవర్సీస్లో రూ. 80 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.3 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే ఇంకొద్ది రోజుల్లో హక్కుల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలను కళ్ళచూసే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు