‘జనతా గ్యారెజ్’ టీజర్ రిలీజ్ వాయిదా

‘జనతా గ్యారెజ్’ టీజర్ రిలీజ్ వాయిదా

Published on May 27, 2016 3:00 PM IST

janathagarage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమాపై అభిమానుల్లో ఇప్పట్నుంచే ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో అభిమానులంతా సినిమాపై అంచనాలను మరింత పెంచేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాకు ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేయాలన్న ఆలోచనతో మే 28న ఓ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా టీజర్‌ను రేపు విడుదల చేయట్లేదని జనతా గ్యారెజ్ టీమ్ తెలిపింది.

కొన్ని అనుకోని కారణాల వల్ల టీజర్ విడుదలను వాయిదా వేశామని, జూన్ నెలలో ఈ టీజర్ విడుదలవుతుందని టీమ్ స్పష్టం చేసింది. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తూండడం విశేషంగా చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు