సైలెంట్ గా జయసుధ వారసుడి మూవీ.!

సైలెంట్ గా జయసుధ వారసుడి మూవీ.!

Published on Apr 21, 2015 1:44 PM IST

jaya-sudha-son
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కరు సక్సెస్ అయితే చాలు వారి ఫ్యామిలీ నుంచి హీరోలు, హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఇప్పుడున్న యంగ్ జెనరేషన్ లో ఎక్కువ భాగం మన స్టార్ హీరోల వారసులే. ఇప్పుడు అదే జాబితాలో మరో వారసుడు తెలుగులో అరంగేట్రం చేయనున్నాడు. అతనెవరో కాదు అలాంటి హీరోయిన్, ఇప్పటికీ సినిమాలు చేస్తున్న నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్. శ్రేయాన్ కపూర్ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు అతను హీరోగా పరిచయం అవుతున్నాడు.

హిందీలో శాస్త్రి సిస్టర్స్, బడే అచ్చే లగతే హైన్ సీరియల్స్ మరియు జోదా అక్బర్ సినిమాలో నటించిన ప్రగతి చౌరస్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో మందిని చూసిన సీరియల్స్ లో ప్రగతి పెర్ఫార్మన్స్ చూసి ఈ సినిమాకి ఫైనల్ చేసారు. వాసు మంతెన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ మొత్తం ఫినిష్ అయ్యాక ఈ సినిమాని మీడియాలోకి, ప్రజల్లోకి తీసుకురావాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఇప్పటకే చాలా భాగం షూటింగ్ పూర్తయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు