కాస్త క్లిష్టంగా మారిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి.!

కాస్త క్లిష్టంగా మారిన హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి.!

Published on Oct 22, 2020 8:55 AM IST

ప్రమాదకారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాము. దీని ప్రభావం అన్ని సినీ ఇండస్ట్రీలపై కూడా భారీ ఎత్తున పడింది. కేవలం ఆర్ధికంగా మాత్రమే కాకుండా అనేక మంది సినీ నటులకు కూడా సోకిన కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది.

ఇటీవలే మన టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ మరియు అతని కుటుంబం కరోనా బారిన పడ్డారని వార్త బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త నిజమే అని జీవితా రాజశేఖర్ తెలిపారు. తన ఇద్దరు కూతుర్లు కోలుకున్నారని తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు.

అయితే ఇప్పుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది అని ఆయన కుమార్తె మరియు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. నాన్న ఇప్పుడు కరోనాతో కష్టతరంగా పోరాడుతున్నారని మీ ప్రార్ధనలు ఆయన్ను కాపాడుతాయని అనుకుంటున్నామని అలాగే తాను ప్రతీ ఒక్కరిని ఆయన కోలుకోవాలని ప్రార్ధించమని కోరుకుంటున్నానని ఎమోషనల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు