‘జిల్’ సినిమాకు మంచి ఓపెనింగ్స్!

‘జిల్’ సినిమాకు మంచి ఓపెనింగ్స్!

Published on Mar 29, 2015 5:06 PM IST

Jil
గోపీచంద్ హీరోగా రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ సినిమాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం ‘జిల్’. ఈ శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందనే వస్తోంది. పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. గోపీచంద్ ఇంతవరకూ కనిపించనంత అందంగా, స్టైలిష్‌గా కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రాశిఖన్నా అందచందాలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. విలన్‌గా నటించిన కబీర్‌ ప్రేక్షకుల వద్దనుండి మంచి మార్కులు కొట్టేశాడు.

విజువల్స్ పరంగా సూపర్ అనిపించుకున్న జిల్.. పాటలు, ఫైట్స్ పరంగా డిస్టింక్షన్ మార్కులు కొట్టేసింది. దర్శకుడు కొత్తదనం లేని కథనే స్టైలిష్‌గా తెరకెక్కించడంతో నెగటివ్ విషయాలు పెద్దగా పరిగణలోకి రాలేదు. భారీ అంచనాల మధ్య విడుదలవ్వడం, విడుదలతోనే మంచి టాక్‌ని సొంతం చేసుకోవడం కలిసొచ్చింది. ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఇక రానున్న రోజుల్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరో వారం పాటు జిల్‌కు మరింత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు