‘జై లవ కుశ’ తమిళనాడు కలెక్షన్లు !

‘జై లవ కుశ’ తమిళనాడు కలెక్షన్లు !

Published on Sep 26, 2017 11:43 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘జై లవ కుశ’ తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీగానే విడుదలైంది. ఇదే తారక్ కు అతి పెద్ద తమిళ రిలీజ్. తెలుగు సినిమాలకు తమిళనాట ఆదరణ పెరిగిన నైపథ్యంలో చిత్ర టీమ్ తమిళనాట విడుదలైపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి భారీ స్థాయి ప్రమోషన్లు నిర్వహించారు. దీంతో వసూళ్ల ఫలితాలు బాగానే వచ్చాయి.

మొదటి రోజు తమిళనాడు వ్యాప్తంగా రూ.72 లక్షల గ్రాస్ చేసి రెండవ రోజుకు రూ.1.1 కోట్లను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం ఆదివారం నాటికి దాదాపు రూ.2.12 కోట్ల గ్రాస్ ను నమోదుచేసింది. ఎన్టీఆర్ కు తమిళనాడులో ఇవే ఉత్తమమైన కలెక్షన్స్ కావడం విశేషం. ఇకపోతే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్లను రాబట్టి ఓవర్సీస్లో ఒకటిన్నర మిలియన్ కు దగ్గరవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు