‘జై లవ కుశ’ కృష్ణా జిల్లా కలెక్షన్లు !


ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ బాక్సాఫీ సువద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా కలెక్షన్లకు కీలకమైన కృష్ణా జిల్లాలో గురువారం మొదటిరోజు రూ.1.70 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం నిన్న 3వ రోజు రూ.41 లక్షలను రాబట్టి మొత్తంగా రూ.2.58 కోట్లను ఖాతాలో వేసుకుంది.

ఇక చిత్ర వర్గాల సమాచారం మేరకు 3 రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రానట్టిన సినిమాగా నిలిచింది. ‘స్పైడర్’ విడుదలకు ఇంకో రెండు రోజులు ఉండటం, ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు ఇలాగే స్టడీగా కనసాగే అవకాశముంది.

 

Like us on Facebook