ఎన్.టి.ఆర్ – పూరి మూవీకి ముహూర్తం ఫిక్స్.!

ఎన్.టి.ఆర్ – పూరి మూవీకి ముహూర్తం ఫిక్స్.!

Published on Jul 25, 2014 12:36 AM IST

NTR---Puri
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘రభస’ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసారు. ‘రభస’ ఆడియో రిలీజ్ డేట్ ఆగష్టు 1 అని, మూవీ రిలీజ్ డేట్ ఆగష్టు 14 అని ఫిక్స్ అయిపోయింది. కావున ఎన్.టి.ఆర్ త్వరగా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఎన్.టి.ఆర్ తదుపరి సినిమా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఉండనుంది.

మాకు అందిన సమాచారం ప్రకారం బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఆగష్టు 1న అధికారంగా లాంచ్ చేయనున్నారు. అది కూడా పూరి జగన్నాధ్ ఆఫీసులో మొదటి షాట్ ని దేవుని పటాలపై చిత్రీకరించనున్నారు. వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన మూడవసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి ‘టెంపర్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

రెండు రోజుల క్రితమే ఎన్.టి.ఆర్ కి అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్న ఎన్.టి.ఆర్ త్వరలోనే ‘రభస’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి పూరి సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు