‘జ్యో అచ్యుతానంద’ ఆడియో రిలీజ్ డేట్
Published on Aug 17, 2016 8:15 pm IST

jyo-achutananda
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ విడుదల చేస్తూ టీం ఆడియో విడుదల తేదీని ప్రకటించింది.

ఆగష్టు 21న హైద్రాబాద్‌లో కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో విడుదల కానుందని టీమ్ తెలిపింది. నిన్న విడుదలైన ట్రైలర్ ఇప్పటికే మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇద్దరు అన్నదమ్ములూ ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న ఆసక్తికర కథతో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Like us on Facebook