జ్యోతిక రీ-ఎంట్రీ సినిమాకు ముహూర్తం కుదిరింది.

జ్యోతిక రీ-ఎంట్రీ సినిమాకు ముహూర్తం కుదిరింది.

Published on Oct 25, 2014 3:50 PM IST

Jyothika
ఏడేళ్ళ విరామం తర్వాత తిరిగి ముఖానికి మేకప్ వేసుకోవడానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం అందరి చూపు జ్యోతిక రీ-ఎంట్రీ ఇవ్వబోయే ఈ సినిమాపైనే ఉంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 17 నుండి చెన్నైలో ప్రారంభమవుతుంది. చెన్నై షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రాజస్థాన్, ఢిల్లీలలో షూటింగ్ చేస్తారు. మలయాళ వెర్షన్ ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కు దర్శకత్వం వహించిన రోషన్ ఆండ్రూస్ తమిళంలో కూడా దర్శకత్వ భాద్యతలను నిర్వర్తిస్తారు. ఈ సినిమాలో జ్యోతిక భర్తగా నటుడు రెహమాన్ కనిపిస్తారు.

జ్యోతిక భర్త, హీరో సూర్య ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. సోషల్ మెసేజ్ కూడిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. విమెన్ ఎంపవర్’మెంట్(మహిళల సాధికారిత) అంశంపై సినిమా నడుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు