సెన్సార్ పూర్తిచేసుకున్న ‘కాలా’ !

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘కాలా’ !

Published on May 22, 2018 2:46 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తైన నిర్మాతలు మండలి నిరసన కారణంగా వాయిదాపడి చివరికి జూన్ 7వ తేదీన విడుదలకానుంది. ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా రజనీ వెంటనే రంజిత్ కు అవకాశమిస్తూ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. సెన్సార్ మెంబర్స్ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్ర రన్ టైమ్ 2 గంటల 46 నిముషాలుగా ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదలచేస్తోంది. ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడిగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు