‘కాటమరాయుడు’కి డేట్ ఫిక్స్ చేసిన పవన్!

‘కాటమరాయుడు’కి డేట్ ఫిక్స్ చేసిన పవన్!

Published on Oct 24, 2016 2:18 PM IST

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదట్నుంచీ ప్లాన్ చేసిన టీమ్, ఆ ప్రకారంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.

ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు