రజనీ సినిమాకు అరుదైన గౌరవం!

రజనీ సినిమాకు అరుదైన గౌరవం!

Published on Jun 25, 2016 6:58 PM IST

kabali
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. సౌతిండియన్ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. టీజర్, ఆడియోతో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా అదేరోజున భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు యూరప్‌లో ఓ ప్రత్యేక గౌరవం దక్కనుంది.

యూరప్ దేశాలన్నింటికెల్లా అతిపెద్ద థియేటర్ అయిన పారిస్‌లోని ‘ది గ్రాండ్ రెక్స్‌’లో ‘కబాలి’ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శితం కానుంది. సుమారు 2000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌లో ఓ ఇండియన్ సినిమా ప్రీమియర్ ప్రదర్శితం కానుండడం విశేషంగానే చెప్పుకోవచ్చు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూఎస్, మలేషియా, జపాన్, యూకే.. లాంటి దేశాల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు