‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో అంతర్జాతీయ నటుడు..?

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో అంతర్జాతీయ నటుడు..?

Published on May 3, 2016 7:00 PM IST

kabir-bedi
బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తన వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పై ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త విసిపిస్తున్నది. ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్, హాలీవుడ్ నటుడు నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే శాతకర్ణి తల్లి గౌతమి పాత్రకోసం బాలీవుడ్ నటి హేమమాలినిని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రకోసం హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన కబీర్ బేడి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లో నటించబోతున్నట్లు సమాచారం.

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుంది. మే 9 న మొరాకోలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు