గ్లామర్‌తో ‘టెంపర్’ ఎక్కిస్తున్న కాజల్

గ్లామర్‌తో ‘టెంపర్’ ఎక్కిస్తున్న కాజల్

Published on Jan 30, 2015 12:45 AM IST

Kajal
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టెంపర్’. ఎన్టీఆర్ సరసన ముచ్చటగా మూడోసారి కాజల్ అగర్వాల్ జంటగా నటించింది. బుధవారం ఈ సినిమా ఆడియో, ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుండి మంచి స్పందన సొంతం చేసుకున్నాయి.

కలువ కళ్ళ కాజల్.. తన గ్లామర్‌తో కుర్రకారుకి ‘టెంపర్’ ఎక్కిస్తుంది. ప్రచార చిత్రాలలో ఆమె కనిపించిన తీరు యువతకు మత్తెక్కించింది. ఈ చిత్రంలో కాజల్.. కాస్త ఒళ్ళు చేసినట్టు కనిపించింది. ఎక్కడ అందాలను చూపిస్తే ప్రేక్షకులు బుట్టలో పడతారో ఆమెకు బాగా తెలుసు. ‘టెంపర్’లో అవే చూపింది. ఆ ఒంపు సొంపులు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాజల్ పనైపోయిందంటూ.. విమర్శించినవారికి ‘టెంపర్’ సినిమాతో సమాధానం చెప్తుందని, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘గోవిందుడు అందరివాడేలే’తో హిట్ ట్రాక్ ఎక్కిన కాజల్.. ‘టెంపర్’తో కంటిన్యూ చేస్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు