విశాల్ సరసన కాజల్!

విశాల్ సరసన కాజల్!

Published on Mar 5, 2015 6:18 PM IST

Kajal-Agarwal-and-vishal
తన అందంతో, నటనతో తెలుగునాట మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కాజల్.. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి పేరున్న విశాల్ సరసన నటించనుంది. ఎన్టీఆర్‌కు జోడీగా కాజల్ నటించిన టెంపర్ ఈమధ్యే విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఆమె ఈ ద్విభాషా చిత్రంలో నటించనుంది.

మాస్, కమర్షియల్ సినిమాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉండడంతో అతని సినిమాలు మినిమమ్ గ్యారంటీ అనే పేరును సంపాదించుకున్నాయి. గతంలో పాండియనాడు..(తెలుగులో పల్నాడు) సినిమాను విశాల్ తో రూపొందించిన టీమ్ వేంథర్ మూవీస్ సంస్థ మళ్లీ మరో సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు పల్నాడుకు పనిచేసిన టీమ్ అంతా ఈ సినిమాకు పనిచేస్తోంది. సినిమాటోగ్రాఫర్ గా వేల్ రాజ్ ను ఎంచుకున్నారు. హోలీ సందర్భంగా ఈ సినిమాను చెట్పట్ లోని సిందూరపూవు హవుస్ లో ప్రారంభించారు. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు