తన హాలీవుడ్ డ్రీమ్ గురించి ప్రస్తావించిన కాజల్ !

తన హాలీవుడ్ డ్రీమ్ గురించి ప్రస్తావించిన కాజల్ !

Published on Jan 17, 2017 11:54 PM IST

kajal1
‘ఖైదీ నెం 150’ చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన అభిమానుల కోసం ట్విట్టర్ వేదిక ఆస్క్ సెషన్ నిర్వహించారు. అభిమానులు ఎవరైనా సరే తనను ప్రశ్నలు అడగవచ్చని వారితో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. దీంతో వేలాది మంది అభిమానులు ఆమెను ప్రశ్నలతో ముంచెత్తారు. కాజల్ కూడా ఓపిగ్గా, సరదాగా ఫ్యాన్స్ అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వాటిలో ముఖ్యంగా హాలీవుడ్ లో సినిమా చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు అనే ప్రశ్నకు కాజల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది.

ఆ ప్రశ్న అడిగిన వెంటనే కాజల్ ఏమాత్రం టైమ్ తీసుకోకుండా స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ లినార్డో డికాప్రియో పేరు చెప్పి తన హాలీవుడ్ డ్రీమ్స్ ఏ రేంజులో ఉన్నాయో చూపించింది. ఇంకా తన వ్యక్తిగత విషయాలను, అభిరుచులు వంటి ఎన్నో విషయాలను ఆమె ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇకపోతే కాజల్ విజయ్ 61వ సినిమాలో హీరోయిన్ గా ఫిక్సైంది. ప్రస్తుతం రానా – తేజ ల ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో సైతం నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు