కళ్యాణ్ రామ్ తో చేతులు కలిపిన కాజల్ !
Published on Jul 2, 2017 12:29 pm IST


‘ఇజం’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన నూతన చిత్రం ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల 9వ తేదీన మొదలైన రెగ్యులర్ షూట్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈరోజు నుండి పాల్గొంటోంది. కెరీర్లో తోలి తెలుగు సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నటించిన ఈమె చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయనతో జోడీ కడుతోంది.

కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనుంది. భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్లు నటిస్తున్నారు. ఇకపొతే నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడు, ఇతర టెక్నీషియన్లు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook