కాజల్ మరో భారీ ఆఫర్ దక్కించుకుందా ?
Published on Sep 28, 2016 2:04 pm IST

kajal
దక్షిణాది పరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళంలలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టారా చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 తో పాటు తమిళంలో స్టార్ హీరో అజిత్ 57 వ చిత్రంలోనూ అలాగే మణిరత్నం డైరెక్షలో జీవ హీరోగా రూపొందుతున్న ‘కావలై వెండం’ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇన్ని భారీ ప్రాజెక్టులు చేస్తున్న ఈమెను మరో పెద్ద ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.

తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇలయదళపతి విజయ్ 61వ చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తోందట. ప్రసుతం కోలీవుడ్ లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ‘విజయ్ తెండల్’ సంస్థ నిర్మాణంలో అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో విజయ్, కాజల్ జంటగా వచ్చిన ‘తుపాకి, జిల్లా’ సినిమాలు భారీ విజయాలుగా నిలిచిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook