తమిళ్ లో కాజల్ కి మరో బంపర్ ఆఫర్

తమిళ్ లో కాజల్ కి మరో బంపర్ ఆఫర్

Published on Aug 29, 2015 5:01 PM IST

jiva-and-kajal
‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ‘మగధీర’ సినిమాతో స్టార్డం తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారిన అందాల భామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఈ పదేళ్ళ కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ ఏడాది టెంపర్ సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న కాజల్ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అవే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ బాబు నటించనున్న ‘బ్రహ్మోత్సవం’.

ఈ రెండు సినిమాలతోనే కాకుండా ఈ ఏడాది కాజల్ పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే విశాల్ సరసన చేసిన పాయుం పులి లేదా జయసూర్య సినిమా షూట్ మొత్తం పూర్తయ్యి సెప్టెంబర్ 4న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది కాకుండా తాజాగా కాజల్ మరో క్రేజీ తమిళ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. తమిళ యంగ్ హీరో జీవ హీరోగా దీకి డైరెక్షన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు కాజల్ సైన్ చేసింది. ఈ సినిమాలో బాబీ సింహా, నిక్కీ గార్లానిలు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు