సీనియర్ హీరో సరసన కాజల్ అగర్వాల్ ?
Published on Nov 7, 2017 10:12 am IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటు తెలుగు, అటు తమిళంలలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్లో నటిస్తున్న ఆమె త్వరలో టాలీవుడ్ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే దర్శకుడు తేజ డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ తో కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఐతే బాగుంటుందని అనుకుంటున్నారట తేజ. తెలుగులో కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన తేజ ఇటీవలే ఆమెను హీరోయిన్ గా పెట్టి చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో కమ్ బ్యాక్ హిట్ ను అందుకుని మరోసారి ఫామ్లోకి వచ్చారు. ఆ సెంటిమెంట్ తోనే అయన కాజల్ కు ఈ ఆఫర్ ఇచ్చి ఉంటారనేది ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలన్నా, ఒకవేళ నిజమైతే కాజల్ తేజ ఆఫర్ కు ఒప్పుకుంటారో లేదో తెలియాలన్నా కాస్త వెయిట్ చేయాల్సిందే.

 
Like us on Facebook