‘ఔర్ దేవదాస్’లో కాజల్ అగర్వాల్ నటించడం లేదా..?

‘ఔర్ దేవదాస్’లో కాజల్ అగర్వాల్ నటించడం లేదా..?

Published on Sep 1, 2014 1:30 PM IST

kajal-agarwal
తెలుగు, తమిళ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ ఒక హిందీ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందని సమాచారం. ప్రముఖ దర్శకుడు సుదీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఔర్ దేవదాస్’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇతర సినిమా షూటింగ్లతో బిజీగా ఉండడం వలన ‘ఔర్ దేవదాస్’లో నటించలేనని చెప్పిందట. బిజీ షెడ్యూల్లో డేట్స్ అడ్జస్ట్మెంట్ చేయలేనని కాజల్ హిందీ అవకాశం వదులుకుంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరివాడేలే’ మరియు ఎన్టీఆర్ సరసన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తుంది. తమిళంలో ధనుష్ సరసన మరో సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్. సింగం, స్పెషల్ 26 వంటి విజయవంతమైన హిందీ సినిమాలు కాజల్ అగర్వాల్ ఖాతాలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు