కాజల్ తన రేటు తగ్గించిందా..?

కాజల్ తన రేటు తగ్గించిందా..?

Published on Jul 31, 2014 8:48 AM IST

Kajal-Agarwal

కొత్త హీరోయిన్లు సమంత, శృతి హాసన్ అందాల ప్రదర్శనలో, అవకాశాలు సొంతం చేసుకోవడంలో ఒక అడుగు ముందు ఉన్నారు. వీరు సినీరంగ ప్రవేశం చేశాకా అప్పటివరకు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ కు అవకశాలు తగ్గాయి. ఈ చందమామ హిందీ సినిమాలపై దృష్టి పెట్టడం కూడా అవకాశాలు తగ్గడానికి ఒక కారణం.

తాజా తెలుగు సినిమాలపై దృష్టి పెట్టిందట కాజల్. గతంలో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అప్పట్లో పారితోషకం బాగానే తీసుకుంది. ఇప్పుడు అవకాశాల కోసం రెమ్యునరేషన్ తగ్గించిందట. స్టార్ హీరోలకు ఫోన్ చేసి కథ బాగుంటే పారితోషకం విషయంలో ఒక మెట్టు దిగుతాను అని చెప్పిందట.

ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరివాడేలే’లో నటిస్తుంది. కొత్త దర్శకులు చెప్పే కథలు కూడా వింటుందట. త్వరలో తెలుగులో మళ్లీ బిజీ కావడానికి ప్రయత్నిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు