స్టార్ హీరో సినిమా కోసం షూటింగ్ మొదలుపెట్టిన కాజల్ !

స్టార్ హీరో సినిమా కోసం షూటింగ్ మొదలుపెట్టిన కాజల్ !

Published on Apr 24, 2017 6:13 PM IST


తమిళ స్టార్ విజయ్ 61వ చిత్రం యొక్క షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇన్నాళ్లు హీరో విజయపైనే జరిగిన షూటింగ్ నిన్నటి నుండి కథానాయికల మీద కూడా మొదలైంది. అందుకే హీరోయిన్ కాజల్ అగర్వాల్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. గతంలో విజయ్ – కాజల్ జంటగా రూపొందిన ‘తుపాకి’ చిత్రం భారీ విజయం సాధించడంతో వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. 2016లో వరుస పరాజయాలు చవిచూసిన కాజల్ కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చి మరోసారి స్టార్ హీరోయిన్ రేస్ లో నిలబడేలా చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రీ తెండల్ ఫిలిమ్స్ తన 100వ చిత్రంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ జూన్ 22న రిలీజ్ కానుండగా చిత్రాన్ని ఈ ఏడాది 2017 లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం మాత్రమే కాకుండా కాజల్ తమిళంలోనే మరో స్టార్ హీరో అజీత్ సరసన ‘వివేగం’, తెలుగులో రానా – తేజల కాంబోలో రూపొందుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలోనూ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు