‘గోవిందుడు..’లో మెరిసిపోనున్న చందమామ.

‘గోవిందుడు..’లో మెరిసిపోనున్న చందమామ.

Published on Sep 23, 2014 4:00 PM IST

Kajal-Aggarwal-(6)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. హట్రిక్ హిట్స్ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడి కడుతుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోలు, ట్రైలర్లలో కాజల్ అగర్వాల్ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఈ చందమామ తన కెరీర్ లోనే అత్యంత అందంగా ‘గోవిందుడు..’లో కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

దర్శకుడు కృష్ణవంశి కాజల్ ను తెరపై చూపించిన విధానం, కాజల్ స్టైల్, ఆమె కాస్ట్యూమ్స్ అన్ని చాలా అద్బుతంగా ఉన్నాయి. ఈ సినిమాకి ఆమె అందం మేజర్ ప్లస్ పాయింట్ అవుతుందని సమాచారం. చరణ్, కాజల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని టాక్. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు