ప్రెస్ నోట్ : “మేము సైతం” అంటున్న కళామందిర్ కళ్యాణ్

ప్రెస్ నోట్ : “మేము సైతం” అంటున్న కళామందిర్ కళ్యాణ్

Published on Nov 25, 2014 9:00 AM IST

kalamandier
సుప్రసిధ్ధ శారీ బ్రాండ్ కళామందిర్ కి సినిమా రంగంతో ఉన్న మైత్రి అందరికీ తెలిసిందే. పలు సినిమాలకు వస్త్ర సహకారం అందించడంతో పాటూ ఆడియో వేడుకలకి ఇతర ప్రచార కార్యక్రమాలకి చేయూతనందిస్తోంది కళామందిర్. సంస్థాగత సామాజిక బాధ్యతలో భాగంగా కొన్నేళ్ల క్రితం కళామందిర్ ఫౌండేషన్ ను నెలకొల్పి అనేక సమాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది కళామందిర్. 2009 లో కర్నూల్ వరద బాధితులకి పునరావాసం కలిపించడం, సినీ నటీ నటులతో ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన ర్యాలీలు నిర్వహించడం, ప్రతిభ ఉండి ఆర్ధిక పరిస్థితులు బాగలేని విద్యార్థులకు సహాయాన్ని అందించడం వంటి కార్యక్రమాలు వాటిల్లో కొన్ని.

ఇప్పుడు సినిమా రంగం మొత్తం కలిసి చేస్తున్న “మేము సైతం” కార్యక్రమంలో భాగస్వామి అవుతూ కళామందిర్ ఫౌండేషన్ చేయికలిపింది. హుదూద్ బాధిత వైజాగ్ ను నిలబెట్టడంలో భాగంగా ఈ “మేము సైతం” కార్యక్రమం సినీ ప్రముఖుల చొరవతో మొదలైందని అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా నవంబర్ 30 న ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలవరకు జరిగే కార్యక్రమాన్ని జెమిని టీవిలో చూడడమే కాకుండా మనసున్న వారు రూ 500 టికెట్ కొన్నట్లైతే ఆ మొత్తాన్ని కూడా హుదూద్ బాధితుల సహాయార్థం చేరవేయడం జరుగుతుంది. అంతే కాకుండా కార్యక్రమం పూర్తయ్యాక తీసే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి అనేక బహుమతులు కూడా అందజేయనున్నారు.

“ఇది పక్కవారికి సాయాన్ని అందిస్తూ మీ అదృష్టాన్ని కూడా పరిశీలించుకునే అవకాశం. ఇదంతా చదివి మీ పనుల్లో మీరు పడిపోతే మా ఈ సంకల్పం నెరవేరినట్టు కాదు. మీరూ టికెట్ కొని హుదూద్ రిలీఫ్ కి సినీ తారలతోపాటు మీరు కూడా ‘మేము సైతం’ అనాలి” అని కళామందిర్ కళ్యాన్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రజలందిరినీ ఉద్దేశిస్తూ అన్నారు. ఈ టికెట్లు దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట, ఏ ఎస్ రావు నగర్, ప్యాట్నీ సెంటర్, కూకట్ పల్లి, వరంగల్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూర్ లో ఉన్న అన్ని కళామందిర్ షో రూంస్ లోనూ లభిస్తాయి.

ఇలా “మేము సైతం” లో భాగం కోరుతూ అనేక ఇతర కమెనీలు కూడా ముందుకు రావడం ముదావహం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు