‘ఇజం’ కోసం సర్వం సమర్పించేసుకున్న కళ్యాణ్ రామ్ !
Published on Oct 15, 2016 12:54 pm IST

ism
నందమూరి కళ్యాణ్ రామ్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక తడబడుతూనే ఉన్నాడు. ఆ మధ్య ‘పటాస్’ లాంటి హిట్ దొరికినా ఆ సక్సెస్ వేవ్ ఏంటో కాలం కొనసాగలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఎక్కువకాలం గుర్తుండిపోయే విజయం సాధించాలన్న లక్ష్యంతో కళ్యాణ్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ‘ఇజం’ అనే సినిమా రాబోతోంది. బలమైన సామాజిక సందేశం ఉన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ జర్నలిస్టుగా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.

డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేసిన రామ్ సిక్స్ ప్యాక్ కూడా రెడీ చేసుకున్నాడు. అలాగే మ్యానరిజంలో కూడా పూరి మాస్ మార్క్ కనబడే విధంగా తయారయ్యాడట రామ్. ఒకరకంగా చెప్పాలంటే సినిమా కోసం తనని తాను సమర్పించేసుకున్నాడట ఈ నందమూరి హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్, ఆడియో సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతిధి ఆర్య హీరోయిన్ గా నటించగా జగపై బాబు ఓ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మధ్యే సెన్సార్ పనులు ముగించుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది.

 
Like us on Facebook