ఈ అబ్బాయి మంచి ఎంటర్టైనర్ !

ఈ అబ్బాయి మంచి ఎంటర్టైనర్ !

Published on Jan 18, 2018 8:04 PM IST

కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రాల్లో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ కూడా ఒకటి. చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. కళ్యాణ్ రామ్ గత సినిమాల్లో లేనంత విధంగా ఈ సినిమాలో కామెడి ఉండబోతోందని సమాచారం. ఫుల్ లెంత్ కామిడి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

భారత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. సాంగ్స్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో దర్శకుడు ఉపేంద్ర మాధవ్ విజయం సాదించాలని కోరుకుందాం. దర్శకుడిగా ఆయనకు ఇది మొదటి సినిమా అయినా అనుభవం గల దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. మర్చి లో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ చిత్ర ఆడియో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు