రౌడీల పని పడుతున్న కళ్యాణ్ రామ్ ‘పటాస్’

రౌడీల పని పడుతున్న కళ్యాణ్ రామ్ ‘పటాస్’

Published on Oct 30, 2014 8:40 AM IST

Patas

నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 90% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఎంసిటిసి బిల్డింగ్ లో వేసిన ఓ సెట్లో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా రౌడీ మూకల ఆట కట్టిస్తున్నాడు. వెంకట్ మాసట్ర్ ఈ ఫైట్స్ ని కంపోజ్ చేస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకూ పూర్తైన షూటింగ్ పార్ట్ అనుకున్న దానికన్నా బాగా రావడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన శృతి సోది హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఇది కాకుండా కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘షేర్’ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇవి రెండూ కాకుండా కళ్యాణ్ రామ్ తన ప్రొడక్షన్ బ్యానర్ లో ‘కిక్ 2’ ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు