కొత్త సినిమాను లాంచ్ చేయనున్న కళ్యాణ్ రామ్ !
Published on Apr 23, 2018 1:45 pm IST


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. ఇటీవలే ‘ఎం.ఎల్.ఏ’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన త్వరలో ‘నా నువ్వే’తో రానున్నారు. తమన్నా కథానాయకిగా నటించిన ఈ సినిమా మే 25న విడుదలకానుంది. ఈ చిత్ర షూటింగ్ కూడ ముగియండంతో ఆయన ఈ నెల 25న ఇంకో కొత్త సినిమాను లాంచ్ చేయనున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె. వి.గుహన్ డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేత థామస్, షాలిని పాండేలు నటించనున్నారు. ‘నా నువ్వే’ను నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని కూడ నిర్మించనుండగా మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇది కాకుండా దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో కూడ ఒక సినిమాను చేయనున్నాడు కళ్యాణ్ రామ్.

 
Like us on Facebook