జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’ !

జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’ !

Published on Sep 22, 2019 11:31 AM IST

నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తోన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా” చిత్రం నుండి నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో తమ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తోన్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఈ చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఎంత మంచివాడవురా” టీం స్పష్టం చేసింది.

కాగా శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సారి సంక్రాంతికి మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’, అలాగే బన్నీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకి పోటీగా ఇప్పుడు “ఎంత మంచివాడవురా” సినిమా కూడా చేరింది. మరి ఈ పోటీలో ఎవ్వరు నెగ్గుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు