ఏప్రిల్ నుండి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా !

ఏప్రిల్ నుండి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా !

Published on Mar 23, 2018 11:31 AM IST

హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈరోజే ‘ఎం.ఎల్.ఏ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన త్వరలో మే 25న ‘నా నువ్వే’ సినిమాతో అలరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనుల్లో ఉండటం వలన కొత్త సినిమాను ప్రారంభించనున్నారు ఈ నందమూరి హీరో.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో ఇదివరకే ఒక సినిమాను ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 4వ వారం నుండి మొదలుకానుంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు