అఖిల్ నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఆమే.. కన్ఫర్మ్ !
Published on Jul 9, 2017 1:14 pm IST


మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ మధ్యే ఒక సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు పలువురి పేర్లను పరిశీలించినా చివరికి దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణిని ఫైనల్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలు ఎంతవరకు నిజమో అని ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది.

తాజాగా సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయం దాదాపు నిజమే అని, హీరోయిన్ గా కళ్యాణి ఫిక్స్ అని తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి. నాగార్జున ప్రత్యేక పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రానికి పి. ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook