రెండు సినిమాలను ఒకేసారి మేనేజ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ !

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు కాజల్ అగర్వాల్ జోడీగా ఉపేంద్ర మాదవన్ దర్శకత్వంలో ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే సినిమా చేస్తున్న ఆయన ఇటీవలే ఒక షెడ్యూల్ ముగించి తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో చేస్తున్న మరొక చిత్ర షూటింగును తిరిగి మొదలుపెట్టనున్నారు.

ఇది వరకే కొంతవరకు పూర్తైన ఈ షూటింగ్ ఈ నెల 29 నుండి తిరిగి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ డిసెంబర్ 20 వరకు జరగనుంది. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లను ఇందులోనే చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా చాలా వరకు పూర్తికానుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజీ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా పి. సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

ఇలా రెండు సినిమాలను పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్న కళ్యాణ్ రామ్ రెండింటిపైనా ఆశలు పెట్టుకురుడు.

 

Like us on Facebook