కమల్ హాసన్‌ను చిక్కుల్లో పడేసిన ట్వీట్!

కమల్ హాసన్‌ను చిక్కుల్లో పడేసిన ట్వీట్!

Published on Dec 6, 2016 6:17 PM IST

kamal-hasan
తమిళనాడు ప్రజలంతా ఎంతో ఇష్టంగా ‘అమ్మ’ అని పిలుచుకునే నాయకురాలు జయలలిత చనిపోవడంతో ఆమె అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్క తమిళనాడులోనే కాక, ఆమె గొప్పదనాన్ని కొనియాడుతూ దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని మోదీ సహా సినీ, రాజకీయ రంగ ప్రముఖులంతా చెన్నైలో ఆమెకు నివాళులర్పించేందుకు విచ్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వేసిన ఒక ట్వీట్ ఆయనను చిక్కుల్లో పడేసింది.

జయలలితతో కమల్ హాసన్‌కు కొద్దికాలంగా గొడవలున్నాయి. ఆయన నటించిన ‘విశ్వరూపం’ విడుదల కాకుండా జయలలిత దగ్గరుండి ప్లాన్ చేశారన్నది కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ‘జయలలితను నమ్ముకొని బతుకుతున్న వారి పట్ల సానుభూతి వ్యక్తపరుస్తున్నా’ అన్న అర్థం వచ్చేలా ఒక ట్వీట్ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ లాంటి ఓ గొప్ప పేరున్న నటుడు ఈ ట్వీట్ వేయడం అస్సలు బాలేదని నెటిజన్స్ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు