కమల్ హాసన్ మేకప్ టైం 4 గంటలు.!

కమల్ హాసన్ మేకప్ టైం 4 గంటలు.!

Published on Aug 17, 2014 8:00 PM IST

kamal-haasan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మరోసారి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న సినిమా ‘ఉత్తమ విలన్’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబదించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ కేరళ ఉత్తర మలబార్ ప్రాంతానికి చెందిన తెయ్యం అనే ఓ గెటప్ లో కనిపించాలి. ఆ గెటప్ కోసం మేకప్ వేసుకోవడానికి కమల్ హాసన్ కి 4 గంటల సమయం పట్టేదట..

అలాగే ఈ మేకప్ వేయడానికి థాయ్ ల్యాండ్ నుంచి ఒకరు, కొరియా నుంచి ఒకరు, కేరళ నుంచి ఒకరు కలిసి వర్క్ చేసారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రమేష్ అరవింద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కె. బాలచందర్, పూజ కుమార్, ఆండ్రియా, పార్వతి, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ – రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్ర టీం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇది కాకుండా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు