సెట్స్ నుండి లీకైన భారతీయుడు 2 లోని కమల్ లుక్

సెట్స్ నుండి లీకైన భారతీయుడు 2 లోని కమల్ లుక్

Published on Oct 24, 2019 12:12 AM IST

దాదాపు 23ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు మూవీ ఓ సంచలనం. నేటి సమాజంలోని లంచగొండి తనంపై ఒకప్పటి ఇండిపెండెన్స్ ఫైటర్ చేసే పోరాటం ఆధారంగా 1996లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తన మూడవ చిత్రంగా కమల్ హాసన్ తో ఈ చిత్రం చేశారు. అలాంటి అద్భుత చిత్రానికి కొనసాగిపుంగా భారతీయుడు 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం భూటాన్ లో 40కోట్ల ఖర్చుతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారని సమాచారం.

కాగా ఈ షూటింగ్ సెట్స్ లోని కమల్ ఫోటో ఒకటి లీకైంది. 90ఏళ్ల వృద్ధుడు గా కమల్ కి మేకప్ వేస్తున్నప్పుడు తీసిన ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. మొదటి పార్టులో వలే ఈ మూవీలో కూడా కమల్ హాసన్ యువకుడిగా, మరియు వృద్దుడిగా రెండు గెటప్స్ లో కనిపించనున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని భాస్కర్ సిద్దార్ధ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు