రియల్ వర్డ్ వార్ వెపన్స్ తో రానున్న ‘కంచె’

రియల్ వర్డ్ వార్ వెపన్స్ తో రానున్న ‘కంచె’

Published on Sep 2, 2015 6:50 PM IST

Kancahe
కెరీర్ ప్రారంభంలోనే డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకొని అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తున్న యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్. ముకుంద లాంటి లోకల్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’తో వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ సినిమాని చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. గమ్యం’ ఫేం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని నిన్ననే హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ ట్రైలర్ లో చూపిన విజువల్స్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో చూపిన వరల్డ్ వార్ II ఎపిసోడ్ సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో చేసిన ఎపిసోడ్ గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘కంచె సినిమాలో మేము వరల్డ్ వార్ II నేపధ్యాన్ని ఎంచుకోవడమే కాకుండా, అప్పట్లో వాడిన రియల్ వెపన్స్ ని కూడా ఇందులో వాడాము. అవి సినిమాకి ఎంతో రియలిస్టిక్ ఫీల్ ని తెప్పిస్తాయి. అంతే కాకుండా సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే క్రిష్ ఓ మాజీ ఆర్మీ సోల్జర్ ని ని తీసుకువచ్చి మాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన సెట్లో ఉండి అన్ని వార్ ఎపిసోడ్స్ ని పర్యవేక్షించే వారని’ తెలిపాడు. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. సెప్టెంబర్ 12న గ్రాండ్ గా ఆడియోని రిలీజ్ చేసి, అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు